తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు నటి సమంత. ప్రస్తుతం ఆమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు తమిళంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది సామ్. పెళ్లి తర్వాత ఆమె నటించిన రంగస్థలం, అభిమన్యుడు చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.
అయితే తాజాగా 2018 చివరి నాటికి సమంత సినిమాలకు గుడ్ బై చెప్పి, ఇంటిపాటినే ఉండి కుటుంబాన్ని చూసుకుంటుందనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై భర్త నాగచైతన్య స్పందించాడు. సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వస్తోన్న వార్తలలో నిజం లేదని చెప్పారు. ఆమెకు సినిమాలంటే పిచ్చి, కొన్ని సందర్భాలను బట్టి, కొంతకాలం విరామం తీసుకోవచేమో కానీ, పూర్తీగా దూరం కాదని అన్నారు. దీంతో సమంతపై వస్తోన్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.