జులై లో పుట్టండి..కెప్టెన్ అవ్వండిః సెహ్వాగ్

222
sehwag
- Advertisement -

టీంఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. ఆయ‌న దృష్టికి వ‌చ్చిన ఏ విష‌యాన్ని అయిన త‌న ట్వీట్ట‌ర్ ద్వారా పంచుకుంటాడు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. ఆయ‌న చేసిన ట్వీట్ల‌కు ప‌లువురు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు వైర‌ల్ అవుతాయి. తాజాగా మ‌రో ట్వీట్ చేశాడు ఆ విధ్వంస‌క‌ర ఆట‌గాడు.

 Sehwag

త‌న టిట్వ‌ర్ ద్వారా సెహ్వాగ్ ప‌లువురికి త‌న‌దైన స్టైల్లో పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతాడు. ఆయ‌న అంద‌రిలాగా కాకుండా కొత్త కొత్త క్రియేటివిటి చేసి శుభాకాంక్షాలు చెబుతాడు. తాజాగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. జులై నెల‌లో పుట్టిన వారిపై ఓ ఫ‌న్నీ ట్వీట్ చేశారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న ఇలా ట్వీట్ చేశారు. జులై 1న ధోని పుట్టాడు, 8న గంగూలీ పుట్టాడు, 10న సునీల్ గ‌వాస్క‌ర్ పుట్టారు. భ‌విష్య‌త్తులో జులై 9న పుట్టిన వారు టిమిండియా కెప్టెన్ పుడ‌తాడు అని చెప్పాడు. ఒక వేళ అత‌ను పుట్టి ఉంటే ఈరోజు సెల‌బ్రెట్ చేసుకుని ఉంటాడేమో అని ట్వీట్ చేశారు. ఈసంద‌ర్భంగా చివ‌ర‌కు చిన్న కామెంట్ ను కూడా జోడి చేశాడు. జులైలో పుట్టండి..కెప్టెన్ అవ్వండి అంటూ కామెంట్ చేశాడు. సెహ్వాగ్ చేసిన ట్వీట్ల‌పై క్రికెట్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -