మెగా హీరోతో ఇస్మార్ట్ హీరోయిన్..!

617
nabha natesh movie
- Advertisement -

తెలుగు తెరపై కన్నడ ముద్దుగుమ్మ నభా నటేశ్ తన నటనతో, గ్లామర్‌తో కుర్రకారు మనసులను దోచుకుంటుంది.. తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’తోనే విజయం అందుకుంది ఈ బ్యూటీ. ఇక రెండవ సినిమాతోనే డైరెక్టర్‌ పూరి ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్‌కు జోడీగా తెలంగాణ స్లాంగ్‌లో మాస్ క్యారెక్టర్‌తో అదరగొట్టింది. దీంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

nabha natesh

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన `డిస్కో రాజా` చిత్రంతో వేడెక్కించే పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీని భారీ ఆఫర్‌లు తన ఇంటి తలుపు తడుతున్నాయట. ఇటీవలే అక్కినేని అఖిల్ సరసన చాన్స్ దక్కనుందని ప్రచారమైంది. ఆ ఆఫర్ సంగతేమో కానీ.. తాజాగా సుప్రీం హీరో సాయిధరమ్ సరసన నభా ఓ క్రేజీ చిత్రానికి సంతకం చేసింది. ఈ సినిమాకి టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇదే చిత్రంతోనే సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబర్ లో సినిమా ప్రారంభం కానుంది. మెగా నిర్మాత బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -