రెండో పెళ్లిపై తేజు..స్పందన ఇదే…!

299
sai dharam tej

మెగా కాంపౌండ్‌ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్స్‌,ఫ్లాప్స్‌ దూసుకుపోతున్నారు సాయి ధరమ్ తేజ్‌. రీసెంట్‌గా చిత్రలహరితో హిట్ కొట్టిన తేజు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను పదో తరగతి చదివేటప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారని తేజు చెప్పారు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో 15 ఏళ్ల క్రితం వారు విడిపోయారని ఎవరికి తెలియని విషయాలను బయటపెట్టి షాకిచ్చాడు.

నాన్నతో విడిపోయాక 2011లో అమ్మ మరో వ్యక్తిని పెళ్లాడిందని తేజు తెలిపారు. తాను, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుంటే అమ్మ ఒంటరిగా ఉండొద్దనే భావనతోనే రెండో పెళ్లికి ఒప్పించామని ..అమ్మను పెళ్లాడిన వ్యక్తి కంటి డాక్టర్ చాలా మంచివాడని చెప్పారు. ప్రస్తుతం తాను, తమ్ముడు ఆయనతోనే కలిసి ఉన్నామని వెల్లడించారు.

అమ్మానాన్న విడిపోయాక ఆ లోటు తెలియకుండా నన్ను, తమ్ముడిని అమ్మ పెంచి పెద్ద చేసిందని తెలిపారు. తాను ఇప్పటికీ నాన్నతో టచ్‌లోనే ఉన్నానని… నాన్న సినీ రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో ఆయనతో సినిమాల గురించి డిస్కష్ చేయనని చెప్పాడు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూళ్లో ఉంటున్నారని వెల్లడించాడు.