టాలీవుడ్ మన్మథుడు, అభిమానుల కింగ్ అక్కినేని నాగార్జున ఆగస్టు 29న 60వ ఏట అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడు అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను జరుపుకునే నాగ్ ఈ సారి స్పెయిన్‌లో బర్త్ డే వేడుకను జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అందరికి థ్యాంక్స్ చెప్పారు.
మామ నాగార్జున ఎప్పటికీ స్పెషలేనని…వయసు పెరుగుతున్న కొద్ది ఆయన అందం మరింత పెరుగుతోందన్నారు. మావయ్య పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నాగ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది సమంత. స్పెయిన్ లోనే వారం రోజులపాటు హాలీ డే ట్రిప్‌ని ఎంజాయ్ చేయనున్న నాగ్ దంపతులు సెప్టెంబర్ 6న ఇండియాకు తిరిగొస్తారని ఫిలిం నగర్ టాక్.
నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ 3 హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తున్నారు.