సాహో…రికార్డ్ షోస్

1040
sahoo
- Advertisement -

‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో జోరు మీదున్న ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం చేశాడు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సాహో మేనియాతో తెలుగు రాష్ట్రాలు ఉగిపోతున్నాయి.

ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల స్క్రీన్స్‌లో సినిమా విడుదలవుతుంది. నైజాంలో మొదటిరోజు దాదాపు 2300ల షోలు,కేవలం హైదరాబాద్ సిటీలోనే 1160కి పైగా షోలు ప్రదర్శం కానున్నాయి.

గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఓ తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి. రన్ రాజా రన్‌ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 26 ఏళ్ల సుజీత్ రెండో చిత్రంతోనే స్టార్ దర్శకులు ఎవ్వరూ సాహసం చేశారు.

- Advertisement -