టీఆర్ఎస్‌లోకి ముత్యాల ముగ్గు సంగీత..!

1176
Mutyala Muggu Sangeetha to joins TRS..!
- Advertisement -

ముత్యాల ముగ్గు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తెలంగాణ అమ్మాయి సంగీత. వరంగల్‌కు చెందిన సంగీత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. త్వరలోనే తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలిపింది. ఇటీవలె సీఎం కేసీఆర్‌ని కలిశానని తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చి ఇండస్ట్రీకి సేవ చేస్తానని తెలిపింది. పదవుల గురించి తాను రాజకీయాల్లోకి రావడం లేదని..ఇండస్ట్రీ,ఆర్టిస్టులకు సేవ చేసేందుకు వస్తానని తెలిపింది. ఇండస్ట్రీలో ఇన్‌ స్టిట్యూట్ లేదా అమ్మాయిలకు డ్యాన్స్‌ స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాని తెలిపింది.

ప్రస్తుతం ఎ ఫర్ ఆమెరికా,దిల్ రాజు శ్రీనివాస కల్యాణం,తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో చేస్తున్నాని ఈ సినిమాలో వెంకటేష్ మదర్‌గా చేస్తున్నాని తెలిపింది. అలాగే త్రివిక్రమ్‌ సినిమాలో చేస్తున్నాని… ఈ సంవత్సరం బాగుంటుందని అనుకుంటున్నాని చెప్పింది. బాపు గారి దర్శకత్వంలో సినిమాలు చేయడం తన అదృష్టమని …. తెలుగులో తనను ముత్యాల ముగ్గు సంగీత అంటే తమిళంలో ఎంజీఆర్ హీరోయిన్ అంటారని చెప్పుకొచ్చింది.

సంగీత అసలు పేరు లత.నిర్మాత యు.విశ్వేశ్వర రావు లత పేరును ‘సంగీత’గా మార్చాడు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది. వీటిలో ముత్యాల ముగ్గు, తాయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 2008లో సినిమా నిర్మాణరంగంలో ప్రవేశించి భాగస్వామిగా తన మేనల్లుడు పి.సునీల్‌తో పసుపులేటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించింది.

- Advertisement -