హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో మొదటి సారి ఫైనల్ కు చేరిన పుణె జట్టు విజయాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటికే మూడు సార్లు పుణె చేతిలో ఓడిన ముంబై ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుందంటున్నారు క్రికెట్ నిపుణులు.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-10 ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కష్టాల్లో పడింది. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ముంబయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ముంబయి స్కోరు బోర్డును ముందుండి నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. జంపా వేసిన 11 ఓవర్ మొదటి బంతిని భారీ షాట్ ఆడగా.. బౌండరీలైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాది జోరు మీదున్నాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి మనోజ్ తివారీ చేతికి చిక్కి నిరాశపరిచాడు. డేనియల్ క్రిస్టియన్ వేసిన 14 ఓవర్లో హర్దిక్ పాండ్య వికెట్ల ముందు దొరికిపోయాడు. పుణె బౌలర్ల ధాటికి ముంబయి కనీసం 150 పరుగుల మార్క్‌నైనా దాటుతుందో చూడాలి.