మణి పాట హిట్‌ అవుతుందా..?

369
- Advertisement -

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకొన్నాయి.

Manisharma Challenge for Ami Tumi Title Song

అయితే ఈ సినిమాకు మణిశర్మ పాటలను సమకూర్చారు.దీంట్లో స్పెషల్‌ ఎంటనుకుంటున్నారా.. టాలీవుడ్‌లో స్టార్ హీరోస్ అందరికీ అదిరిపోయే హిట్స్ అందించిన అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. దశాబ్ద కాలంపాటు తెలుగులో సంగీతదర్శకుడిగా అగ్రస్థానంలో కొనసాగిన మణి.. ఆ మధ్య బాగా స్లో అయ్యాడు. కొన్ని సినిమాలకు కేవలం రీరికార్డులకే పరిమితమయ్యాడు. అయితే మళ్లీ ఇప్పుడు సంగీత దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీ అయ్యాడు మణిశర్మ. ప్రస్తుతం మణి చేతిలో ఫ్యాషన్ డిజైనర్, అమితుమి, లై వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మళ్లీ మునుపటి స్పీడ్‌ను అందుకునే దిశగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మణిశర్మ చేసిన ఓ వ్యాఖ్య సంచలనంగా మారింది.

Manisharma Challenge for Ami Tumi Title Song

తాను సంగీతాన్నందించిన ‘అమితుమి’ చిత్రంలోని ‘తకదిమితాన’ అనే పాట మోస్ట్ పాపులర్ సాంగ్ కాకుంటే ఇక సంగీతం చేయడం మానేస్తానంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు ఈ స్వర బ్రహ్మ. ఇంద్రకంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమితుమి’ చిత్రం టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అయ్యబాబోయ్ గీతం కూడా ఇప్పటికే రిలీజ్ అయి అలరిస్తోంది. కానీ మణి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్న తకదిమితాన ఎలా ఉండబోతుంది అనేది త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా తన పాటపై ఎంత నమ్మకం ఉంటే మాత్రం బాహాటంగా ఇలా శపథాలు చేయాలా శర్మ అంటూ మణిశర్మ కామెంట్‌పై కామెంట్స్ చేస్తున్నారు సంగీత ప్రియులు. మరి మణి చెప్పిన పాట ఎంత హిట్ అవుతుందో చూడాలి.

- Advertisement -