హార్ధిక్ తండ్రి కన్నుమూత..

63
Pandya

టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇంట విషాదం నెలకొంది. పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పాండ్యా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

పాండ్యా బ్రదర్స్ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కృణాల్ పాండ్యా స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ‌రోడా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండగా తండ్రి మరణవార్త తెలుసుకుని వెంటనే టోర్నీ నుండి నిష్క్రమించాడు. హార్ధిక్ పాండ్యా ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు.