కరోనా కలకలం.. ఇండియా-శ్రీలంక రెండో టీ20 వాయిదా..

60
Sri Lanka vs India

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడ్డాడు. దీంతో ఇండియా-శ్రీలంకల మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఇతర ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ అని తేలితే ఈనాటి మ్యాచ్‌ను బుధవారం జరగనుంది. అయితే రేపు కూడా మ్యాచ్ నిర్వహణ కష్టమేనని చెబుతున్నారు. చివరి మ్యాచ్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు.

పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఇరు జట్లు వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాలని ఆదేశాలు అందాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లందరి కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు వారు ఐసొలేషన్ లోనే ఉండనున్నారు. మరోవైపు, టెస్టు జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో శ్రీలంకలో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లకు పిలుపు వచ్చింది. వీరిద్దరూ నేడో, రేపు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లనున్నారు.