ముంబై ఇండియన్స్‌కు కరోనా షాక్‌..

54
Mumbai Indians

ఐపీఎల్ ఆరంభానికి ముందు మ‌రో షాక్ త‌గిలింది. టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌, ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయన వైరస్‌ బారిన పడినట్లు తేలిందని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం వెల్లడించింది. మోరేకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నామని పేర్కొంది. మోరే.. ముంబై ఇండియన్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కన్సల్టెంట్‌‌గా, ప్రతిభాన్వేషకుడిగా వ్యవహరిస్తున్నారు.