కోల్‌కతాను చిత్తు చేసిన ముంబై..

251
- Advertisement -

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్… ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నిరాశ పర్చింది. మొదట చెత్త బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైన నైట్ రైడర్స్ ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేక చేతులెత్తేసింది. దీంతో అలవోక విజయంతో రోహిత్ సేన పట్టికలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.

Mumbai Indians

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధనాధన్ ఆటతో అలరిస్తే.. రాబిన్ ఊతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) టెస్టు మ్యాచ్‌ను తలపించాడు. ముంబై బౌలర్లో మలింగ్ (3/35), హార్దిక్ (2/20), బుమ్రా (2/31) విజృంభించారు. లక్ష్య ఛేదనలో ముంబై 16.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ అజేయ ఇన్నింగ్స్‌లతో అలరించారు. హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దాదాపు నెలన్నరగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో చెన్నైతో ముంబై తలపడనుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌- గిల్‌ ఎల్బీ (బి) హార్దిక్‌ 9; లిన్‌ (సి) డికాక్‌ (బి) హార్దిక్‌ 41; ఉతప్ప (సి) రోహిత్‌ (బి) బుమ్రా 40; కార్తీక్‌ (సి) కృనాల్‌ (బి) మలింగ 3; రసెల్‌ (సి) డికాక్‌ (బి) మలింగ 0; రాణా (సి) పొలార్డ్‌ (బి) మలింగ 26; రింకూ సింగ్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 4; నరైన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 133; వికెట్ల పతనం: 1-49, 2-56, 3-72, 4-73, 5-120, 6-133, 7-133; బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-19-0; కృనాల్‌ పాండ్య 4-0-14-0; మలింగ 4-0-35-3; బుమ్రా 4-0-31-2; రాహుల్‌ చాహర్‌ 1-0-12-0; హార్దిక్‌ పాండ్య 3-0-20-2

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌- డికాక్‌ (సి) కార్తీక్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 30; రోహిత్‌శర్మ నాటౌట్‌ 55; సూర్యకుమార్‌ నాటౌట్‌ 46; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (16.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 134; వికెట్ల పతనం: 1-46; బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 4-0-25-0; గర్నీ 3-0-20-0; రసెల్‌ 2.1-0-34-0; నరైన్‌ 4-0-33-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 3-0-22-1.

- Advertisement -