రాహుల్‌ని కలవాలంటే బరువు తగ్గాలా?

20
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత జీషాన్ సిద్దిఖీ. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న జీషాన్ తండ్రి ఇటీవలె ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు. దీంతో ముంబై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జీషాన్‌ను ఆ పదవి కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

ఇటీవల తాను ఇటీవలే రాహుల్‌ గాంధీని కలవాలనుకున్నాని తెలిపారు. అయితే రాహుల్‌ను కలవాలంటే నేను బరువు తగ్గాలని ఆయన సన్నిహితులు చెప్పడం తనను బాధించిందన్నారు. రాహుల్ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చినప్పుడు రాహుల్‌తో భేటీ కావాలనుకున్నాని కానీ ఆయన సన్నిహితులు చెప్పిన మాట విని బాధేసిందన్నారు.

రాహుల్‌ను కలవాలంటే తాను 10 కేజీల వరకూ బరువు తగ్గాలని సూచించారని ఆరోపించారు జీషాన్.

Also Read:మునగాకు కషాయం తాగితే?

- Advertisement -