టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ సీనియర్ నేత

178
koushik
- Advertisement -

హుజురాబాద్‌ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గ్రామాల్లో ప్రజల్లో మమేకం అవుతూ టీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిస్తున్నారు. ఇక ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్‌లో చేరగా తాజాగా తెలుగుదేశం క‌రీంన‌గ‌ర్ జిల్లా రైతు సంఘం అధ్య‌క్షుడు ముచ్చ స‌మ్మిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

స‌మ్మిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ గెలుపు కోసం కృషి చేస్తాన‌ని స‌మ్మిరెడ్డి స్ప‌ష్టం చేశారు. స‌మ్మిరెడ్డి గ‌తంలో ద‌మ్మ‌క్కపేట ఎంపీటీసీగా సేవ‌లందించారు.

- Advertisement -