27న సుశాంత్…’ఇచ్చట వాహనములు నిలుపరాదు’

77
sushanth

‘చి.ల.సౌ’తో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు సుశాంత్. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల…వైకుంఠపురుములో’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్న ఈ యువ హీరో ఇప్పుడు ఎస్.దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంలో నటిస్తున్నారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కగా తాజాగా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది.

ఆగస్టు 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇందకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. కేవలం థియేటర్లలోనూ పార్కింగ్ చేయాలని వచ్చిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.

ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.