దుబ్బాక తరహాలోనే ఫేక్ ప్రచారం: రేవంత్

141
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని తప్పుబట్టారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు రేవంత్.

పాల్వాయి స్రవంతి ఫొటోను మార్ఫింగ్ చేసి కేసీఆర్ తో భేటీ అయ్యారంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, ఓటమి భయంతో ఇలా దిగజారారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక తరహాలోనే మునుగోడులోనూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -