rahulgandhi:ఎంపీ రాహుల్‌పై అనర్హత..!

53
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల సురత్ కోర్టు రెండెళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు జైలు శిక్ష పడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు. దీంతో రాహుల్ గాంధీ 2 ఏళ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయారు.

ఇవి కూడా చదవండి…

KTR: BRS..భారత రైతు సమితి

వర్షప్రభావిత ప్రాంతాలకు సీఎం కేసీఆర్..

అప్పుడలా.. ఇప్పుడిలా !

- Advertisement -