గల్లీలో గళమెత్తుతున్న బీజేపీ ఎంపీలు: నామా

32
nama
- Advertisement -

తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేక పోతున్నారని, ఢిల్లీలో మాట్లాడకుండా బీజేపీ ఎంపీలు గల్లీలో గళమెత్తుతున్నారు విమర్శించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. తెలంగాణలో అదనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో “నవోదయ విద్యాలయాలు” ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని 8 సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నామన్నారు. మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. మా నోటీసులను అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు.

నవోదయ విద్యాలయాలు నిర్వహణ సామర్థ్యం (ఫెర్ఫామెన్స్)లో కేరళ తర్వాత తెలంగాణ ఉందన్నారు. దేశంలో కొత్తగా 80 నవోదయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణ కు లేదని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, రాష్ట్ర సమస్యలపై ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -