కేజీఎఫ్‌2 ట్రైలర్‌…అతిథి ఎవరో తెలుసా?

49
kgf2
- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత ఏడాది టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించిన మేకర్స్ ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా తుపాన్ తుపాన్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం వదిలారు. ఈ ఫస్ట్ సింగిల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ నెల 27వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ వ్యవహరించబోతున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

- Advertisement -