పసుపు బోర్డు కోసం మాజీ ఎంపీ కవిత ఎంతో పోరాడారు

381
nama
- Advertisement -

తెలంగాణలో పసుపు బోర్డుకోసం టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంతో పోరాడారు అన్నారు ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణలో సంకేమ పథకాలను ఆపివేయలని చూస్తున్నారు. కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథకాలను ఆపివేయలని ధర్మపురి అరవింద్ పార్లమెంట్ లో ప్రశ్న అడిగినట్లు తెలిపారు. పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం అనేక పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. పేద బిడ్డల పెళ్లిళ్లకు ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు.

పేదలకు చెందే పథకాలను కూడా ఆపాలనే దుర్మార్గమైన ఆలోచన అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్ పథకాలలో ఎలాంటి అవినీతి, ఫ్రాడ్ లేదు అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. గత లోక్ సభలో మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం ఎంతో పోరాడారన్నారు. ఎన్నో సార్లు, పార్లమెంట్ సమావేశాల్లో, కమిటీల్లో లేవనెత్తినట్లు గుర్తు చేశారు. గత ఆరు సంవత్సరాల పోరాట ఫలితమే కేంద్రమంత్రి పియుష్ గోయల్ చేసిన ప్రకటన అన్నారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే మాట్లాడుతూ… కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ పథకాలకు అద్భుతమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అవినీతి రహిత గా ముందుకు పోతుంది. పేద వాళ్లకు చెందాలనే ఈ ఆధార్ కార్డ్ ను అమలు చేస్తున్నాం.. ఇలాంటి వాటిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పియిష్ గోయెల్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. స్పైస్ బోర్డ్ కార్యాలయాన్ని తరలిస్తే హామీ పూర్తి కాదన్నారు. వరంగల్ లో కార్యాలయంను ముట్టుకోవద్దని చెప్పినట్లు వెల్లడించారు.

- Advertisement -