విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత- ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

98
- Advertisement -

విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దాదాపు 7 వేల కోట్ల నిధులను విద్యరంగానికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం, అమీన్ పూర్ మండలం పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గ్రామ సర్పంచ్ నితీషా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్ధానిక నాయకులు, లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో మెడికల్ డివైస్ పార్కు రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని అన్నారు. త్వరలోనే అమీన్ పూర్ మండలంలో ఐటీ పార్కు రాబోతుందని తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పటా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు. పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని.. త్వరలోనే వాటిని ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎంపీపీ దేవానంద్ మాట్లాడుతూ.. పటేల్ గూడా గ్రామంలో సుందరమైన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే చేసిన సహకారం మర్చిపోలేము అన్నారు. గ్రామంలో బీరంగూడ నుంచి పటేల్ గూడా వెల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు గ్రామం అవసరాల దృష్ట్యా అధిక నిధులను కేటాయిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, జిన్నారం ఎంపీపీ, జిన్నారం జడ్పీటిసి ప్రభాకర్, ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్, స్థానిక నాయకులు కొడకంచి జగన్, కొడకంచి లక్ష్మణ్,చిన్నరొయ్యల శ్రీను,ఈర్ల ఆంజనేయులు,గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -