తెలంగాణలో ఆంధ్ర సంగతెందుకు…

228
mp kavitha
- Advertisement -

తెలంగాణలో ఆంధ్ర సంగతెందుకని యుపీఏ ఛైర్ పర్సన్‌ సోనియా గాంధీని ప్రశ్నించారు ఎంపీ కవిత. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఎంపీ కవిత..కాంగ్రెస్ నిర్వహించిన మేడ్చల్ సభలో సోనియా గాంధీ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడకపోవడం బాధకరమన్నారు. సోనియా చేసిన విమర్శలకు కౌంటరిచ్చిన కవిత..ఢిల్లీలో ఓ మాట..తెలంగాణలో మరో మాట మాట్లాడటం సరికాదన్నారు.

తెలంగాణ గురించి కాకుండా ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడటం సరికాదన్నారు. సోనియా మాటలు చూస్తుంటే చంద్రబాబు మాటలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రాకు సోనియా హామీలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడం అన్నారు.

లోక్‌సభలో విభజన హామీలపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తే.. ముందు వరుసలో కూర్చున్న సోనియా కనీసం మాట్లాడలేదన్నారు. టీఆర్ఎస్ ఎక్కడైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుందన్నారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ది ఎప్పటికీ చిన్నచూపేనని స్పష్టం చేశారు.

ఈ నెల 26న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కవిత. ప్రతిపక్ష నేతలు నేతలు అడ్డుకున్నా జగిత్యాలలో అభివృద్ధి చేశామన్నారు.

- Advertisement -