సంక్రాంతి బరిలో రజనీ పెట్టా…

243
rajini petta
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ -త్రిష కాంబినేషన్‌లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెట్టా. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. రజనీ 165వ సినిమా వస్తున్న పెట్టాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్‌లో పాటలు విడుదల చేయనున్నారు. ఒకేసారి అన్ని పాటలు విడుదల చేయకుండా డిసెంబర్ 3న ఫస్ట్ సాంగ్,డిసెంబర్ 7న రెండవ పాటను రిలీజ్ చేయనున్నారు.

విజయ్ సేతుపతి, శశికాంత్, సిమ్రాన్, మేఘా ఆకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రైట్స్‌ని దక్కించుకున్నారు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. త్వ‌ర‌లోనే ఈ మూవీని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.చాలా తక్కువ గ్యాప్‌లో రజనీ సినిమాలు వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

- Advertisement -