నిజామాబాద్ ప్రజలు.. కేసీఆర్‌కు అండగా ఉన్నారు

268
- Advertisement -

నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీ మైదానం టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది.. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది. నిజామాబాద్ పట్టణంలో రోడ్లు, నిజామాబాద్ కు వచ్చే రహదారులన్నీ సభకు వచ్చే వాహనాలతో నిండిపోయాయి. సభా వేదికపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవితతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆసీనులయ్యారు. సీఎం కేసీఆర్ సభా వేదికకు చేరుకున్నారు.

TRS Bahiranga Sabha

ఈ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భం. ఉద్యమం, ఎన్నికల సమయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు.. కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. టీఆర్‌ఎస్‌కు నిజామాబాద్ కంచుకోట. అభివృద్ధిలో నిజామాబాద్ ముందంజలో ఉంది. అన్నారు ఎంపీ కవితక్క. ఆనాడు కామారెడ్డి జిల్లా కావాలని కోరుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కామారెడ్డిని జిల్లా చేశాం.

ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణకు ఆదర్శంగా ఉంటుందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. జిల్లాలో 1625 గ్రామాలకు నీటిని అందిస్తున్నాం. ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో ప్రణాళికలు తయారు చేసుకున్నాం. జిల్లాలో 4 లక్షల 22 వేల మందికి నెలకు రూ. 44 కోట్లతో పెన్షన్లు ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నాం.

MP Kavitha

292 కొత్త పరిశ్రమలు నిజామాబాద్‌కు రావడం ఇక్కడి యువతకు అదృష్టమన్నారు. పరిశ్రమల రాకతో 12 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. నిజామాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చే విధంగా ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4,78,000ల మంది రైతన్నలకు రైతు బంధు పథకం కింద రూ. 4 వేల చొప్పున ఇచ్చామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయ్యాలి. 2014 ఫలితాలను మళ్లీ నిజామాబాద్ జిల్లాలో పునరావృతం చేయాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.

- Advertisement -