ప్రపంచ దేశాల్లో తెలంగాణకు మరో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే బతుకమ్మ పలుదేశాల్లో ప్రచారం చేస్తున్న ఎంపీ కవిత ఒకే పోస్టల్ స్టాంప్ పై కనిపించనున్నారు. న్యూజి లాండ్ లో డాలర్ విలువ చేసే పోస్టల్ స్టాంప్ తో పాటు లండన్ లో ఫస్ట్ క్లాస్ స్టాంపును ఆయా దేశాలు విడుదల చేశాయి. ఈ రెండు దేశాల్లోని టీఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ బాధ్యులు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి కవిత పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
తెలంగాణ భవన్ లో ఎంపీని కలసిన న్యూజిలాండ్, లండన్ ప్రతినిధులు పోస్టల్ స్టాంపులను అందజేశారు. వీటిపై తెలుగు లిపిలో బతుకమ్మ శుభాకాంక్షలు అని ఉండటంతోపాటు బతుకమ్మను ఎత్తుకున్న కవిత ఫొటో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్‌శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, కార్యదర్శి అభినయ్ కనపర్తి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌తోపాటు నగేశ్‌రెడ్డి, జమాల్, జాగృతి నాయకులు రోహిత్‌రావు తెలంగాణ భవన్‌లో ఎంపీ కవితను కలిసి న్యూజిలాండ్, లండన్‌లో విడుదలైన పోస్టల్ స్టాంపులను అందించారు. బతుకమ్మను ఎత్తుకొన్న ఎంపీ కవిత ఫొటో, తెలుగు భాషలో బతుకమ్మ శుభాకాంక్షలు అని పోస్టల్ స్టాంపులపై ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
2006లో తెలంగాణ జాగృతిని స్ధాపించిన కవిత…తెలంగాణ సంస్కృతి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. బతుకమ్మకు పూర్వవైభవం తెచ్చింది.తెలంగాణ మహిళను జాగృతం చేసి విముక్తి పోరాటంలో భాగస్వాములను చేసింది..ఆ ప్రయత్నం కల్పించిన అవగాహన..ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతోనేరాజకీయాల్లోకి వచ్చిన కవిత ప్రజల్లో చైతన్య స్రవంతిని రగిల్చింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఖానాపూర్ గ్రామ పంచాయితీలో దాదాపు 274 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. శ్రీరాంసాగర్ ముంపు గ్రామం కావడంతో వరదలు వచ్చిన ప్రతిసారి ఈ గ్రామ ప్రజలు భయం నీడన బిక్కుమంటూ గడుపుతుంటారు. ఈ విషయాన్ని ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ ఆ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ గ్రామ ప్రజలకు వేరే చోట డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని కవిత హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఇలా ఊరి పేరును ఆమె పేరు వచ్చేలా మార్చేసిన సంగతి తెలిసిందే.