స్పీకర్‌ ‘మేస్’తో ఎమ్మెల్యే పరుగులు

73
TMC leader snatches Speaker’s mace

సాధారణంగా దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలైన అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగుతుంటాయి. అధికార,ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలతో సభ దద్దరిల్లుతుంటుంది. ఇంకా ఘర్షణ ఎక్కువైతే స్పీకర్ వెల్‌లోకి వెళ్లి తమ నిరసన వ్యక్తంచేస్తారు. కొన్ని సమయాల్లో మైకులు విరగొట్టడం, పేపర్ చించివేసి స్పీకర్‌పై చల్లిన సందర్భాలున్నాయి. కానీ త్రిపుర అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుంది.

త్రిపుర అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అటవీశాఖ మంత్రి నరేశ్‌ జమాటియాకి వ్యతిరేకంగా స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అవినీతి ఆరోపణలపై చర్చకు పట్టుబట్టారు. కానీ స్పీకర్ చర్చకు అనుమతించలేదు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్పీకర్‌ పోడియం వద్ద ఉన్న అధికారిక దండాన్ని(మేస్‌)ని తీసుకొని పరిగెత్తాడు. దీంతో అతడు చేసిన ఈ చర్యకు అందరూ ఆశ్చర్య పోయారు.

అయితే వెంటనే మార్షల్స్‌ అతని వెంట పరిగెత్తి దానిని తీసుకొచ్చి తిరిగి స్పీకర్‌ పోడియం వద్ద ఉంచారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ రామేంద్ర చంద్రదేబ్‌నాథ్‌ ‘ఒక్కసారిగా బర్మన్‌ పోడియం వద్దకు దూసుకొచ్చాడు. అతను అలా చేయకండా ఉండాల్సింది. ఈ చర్య సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది’ అని చెప్పారు.