యూ ట్యూబ్‌ని కుమ్మేసిన చిరు ‘అమ్మడు’

234
All Time Records for Chiru.. Ammadu Lets Do Kummudu
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” యూ ట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే సినిమా టీజర్ టాలీవుడ్‌లో రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఇప్పటికే 5 మిలియన్ క్లిక్స్ ను దాటి 6 మిలియన్ దిశగా సాగుతుండగా, తాజాగా విడుదలైన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట కూడా అదే రేంజ్ లో యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది.

అమ్మడు..కుమ్ముడే పాటను విడుదల చేసిన 24 గంటల్లోనే 2 మిలియన్ క్లిక్స్ ను అందుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక పాటకు 24 గంటల్లో 2 మిలియన్ క్లిక్స్ అందుకున్న తొలి సినిమా “ఖైదీ నంబర్ 150” రికార్డులు సృష్టించింది.ఇక సినిమా విడుదల తర్వాత ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

All Time Records for Chiru.. Ammadu Lets Do Kummudu

ఇక తొలుత ఖైదీ ఆడియో…ఈ నెల 25న విజయవాడలో నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది. కానీ ఆడియో ఫంక్షన్‌ని క్యాన్సిల్ చేసి….ఈ నెల 25న డైరెక్ట్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌న జనవరి ఫస్ట్ వీక్‌లో భారీ స్దాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -