మంత్రి తలసానిని కలిసిన టీవీ ఆర్టీస్టులు

419
Tv Artist
- Advertisement -

తమ సమస్యలు పరిష్కరించాలంటూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టీస్ట్ యూనియన్ సభ్యులు. మంత్రి తలసానికి వారు వినతి పత్రం అందజేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ అసోసియేషన్ లో సుమారు 800మంది సభ్యులు ఉన్నారని అందరికి గుర్తింపు, హెల్త్ కార్డులు మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. అదే విధంగా ఇండ్ల నిర్మాణానికి స్ధలం కేటాయించాలని తమ యూనియన్ ను ఫెడరేషన్ లో అనుసంధానంగా గుర్తించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ ఉపాధ్యక్షులు పృద్విరాజ్, ప్రధాన కార్యదర్శి జె.సైదులు, అప్పారావు, ఆశ, లక్ష్మీ తదితరులు ఉన్నారు.

- Advertisement -