Miss AI:మిస్‌ ఏఐగా కెంజాలేలి

31
- Advertisement -

మిస్ ఏఐ పోటీల్లో విజేతగా నిలిచింది మొరాకో సుందరి కెంజాలేలి. తొలిసారి నిర్వహించిన ఈ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది కెంజాలేలి. 1500 మంది కంప్యూటర్‌ మాడిఫైడ్‌ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్‌ అందాల పోటీ విజేతగా నిలిచింది.

విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కగా లేలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుడ్‌, కల్చర్‌, ట్రావెల్‌, ఫ్యాషన్‌, బ్యూటీ వంటివాటిపై వీడియోలు చేస్తుంటుంది. మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని లేలి తెలిపింది. ఈ ఏఐ ముద్దుగుమ్మను ఫోనిక్స్‌ ఏఐ సీఈవో మెరియం బెస్సా సృష్టించారు.

Also Read:త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్..‘బృంద’

- Advertisement -