- Advertisement -
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నల్గొండ జిల్లాలో ని మూసి ప్రాజెక్ట్ 13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసి పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
మూసి ఇన్ ఫ్లో 1.90 వేల క్యూసెక్కులు..ఔట్ ఫ్లో 1.90 వేల క్యూసెక్కులుగా ఉంది.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా,,,ప్రస్తుతం…646.8 అడుగులు కు చేరింది.వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు దగ్గరుండి అధికారులతో పర్యవేక్షిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
- Advertisement -