ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీకి ఊహించని రీతిలో వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 13 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి లక్షా 58 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పరిస్ధితిని ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంకా వరద పెరిగితే ఏం చేయాలి…ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని వరద ఇంకా పెరిగితే రత్నపురం వైపున కట్టకు గండికొట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
సీఈతో సహా ముఖ్య అధికారులంతా ప్రాజెక్టు వద్ద అందుబాటులో ఉండాలి చెప్పారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 645 అడుగులు కాగా ఉదయం ఏడు గంటల వరకు 646.70 అడుగులుగా ఉంది.