భారత ప్రజాస్వామ్య దేశంలో పార్టీలదే కీలకపాత్ర వహిస్తుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎన్‌సీపీ, టీఎంసీ, సీపీఐ పార్టీలను జాతీయ పార్టీలను రద్ధు చేస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆప్ (ఆమ్‌ఆద్మీపార్టీ)జాతీయ పార్టీగా గుర్తించారు.
అయితే ఎదైనా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారాలన్న జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్‌లలో ప్రభుత్వాలను ఏర్పరచింది. అలాగే ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో ఐదు సీట్లను గెలుపొందింది. దీంతో పాటుగా గోవాలో కూడా ఆప్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను గెలిచింది. దీంతో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావాల్సిన అర్హతలను పూర్తి చేసింది. అలాగే ఆరు పార్టీల స్టేటస్‌ను మార్పు చేసింది. ఇందులో పీడీఏ (మణిపూర్), పీఎంకే (పుదుచ్చేరి), ఎఆర్‌ఎలడీ (ఉత్తరప్రదేశ్), బీఆర్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్), ఆర్‌ఎస్‌పీ (పశ్చిమ బెంగాల్) ఎంపీసీ (మిజోరాం) స్టేటస్‌ను ఉపసంహరించుకుంది. ఆయా పార్టీలు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలుగా కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి…