మరో రెండు వారాలల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతున్నందున ‘మంత్ ఆఫ్ మధు’ మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘భానుమతి రామకృష్ణ’ చిత్రాన్ని నిర్మించిన యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని “హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్”తో పాటు “కృషివ్ ప్రొడక్షన్స్” బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా సుమంత్ దామ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ గా రఘువర్మ పేరూరి వ్యవహరిస్తున్నారు.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ అచ్చు రాజమణి స్వరపరిచిన ‘ఓ నా మధు’ పాటను విడుదల చేశారు. ‘ఓ నా మధు’ ప్రేమలోని అందమైన అనుభూతిని ప్రతిబింబించే ప్లజెంట్ మెలోడీ. ఈ లవ్లీ నెంబర్ పియానో ,గిటార్ ట్యూనింగ్‌తో క్లాసిక్, మోడ్రన్ టచ్ తో వున్న వండర్ ఫుల్ ఫ్యుజన్. పాటలోని రొమాంటిక్ ఫీల్ చాలా శ్రావ్యంగా వుంది.
Also Read:పాలమూరు ఎత్తిపోతలపై విష ప్రచారం..
దర్శకుడు శ్రీకాంత్ నాగోతి స్వయంగా సాహిత్యం అందించగా, కార్తీక్, యామిని గంటసాల తమ మెస్మరైజింగ్ వాయిస్ తో అద్భుతంగా అలపించారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి వండర్ ఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు.
ఈ చిత్రానికి రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దర్శకుడు రవికాంత్ పేరెపు ఎడిటర్ గా పని చేస్తున్నారు.శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.