బెట్టింగ్ యాప్స్.. 11 మందిపై కేసులు

8
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మంది సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

వీరంతా సోషల్ మీడియా వేదికగా యూత్‌ని ప్రభావితం చేస్తున్నట్లు ఈ కేసులో పొందుపరిచారు. తాము కావాలని యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, పొరపాటు జరిగిందని కొందరు సెలబ్రిటీలు క్షమాపణ కూడా చెప్పారు. సారీ చెబుతూ రీతూ చౌదరి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే పోలీసులు షాక్ ఇచ్చారు.

గతేడాది బెట్టింగ్ యాప్స్ కారణంగా 1000 మందికి పైగా మృతిచెందారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

Also Read:ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

- Advertisement -