తెలంగాణలో మంకీపాక్స్‌ లేదు డా. శంకర్‌

68
fever
- Advertisement -

తెలంగాణలో మంకీపాక్స్‌ లేదన్నారు ఫీవర్‌ ఆసుపత్రి సూప‌రింటెండెంట్ డా.శంకర్‌ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన కువైట్‌ నుంచి వచ్చిన ఆ యువకుడు తీవ్ర నీరసానికి గురయ్యారు. జ్వరంతో బాధపడతంతో కామారెడ్డిలోని ఓ ప్రవైట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. దద్దుర్లు ఉండటంతో మంకీపాక్స్ లకణాలుగా భావించారు. దీంతో డాక్టర్లు మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నందున్న హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి నుంచి డాక్టర్లు నమూనాలు సేకరించి పుణేలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. తాజాగా బాధిత యువకుడికి మంకీపాక్స్‌ నెగెటివ్‌ అని నిర్ధారణ కావడంతో వైద్యులు ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మంకీపాక్స్ గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్ శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుంచి వ‌చ్చిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు.

- Advertisement -