మనుషులకు మంకీపాక్స్‌ వయా కుక్క: ద లాన్సెంట్‌

52
monkeypox
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మెడికల్‌కు సంబంధించిన రిపోర్టులను పబ్లిష్‌ చేయాలంటే ద లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో పబ్లిష్‌ చేస్తారు. తాజాగా ప్రెంచ్‌ పరిశోధకులు మనుషుల నుంచి కుక్కకు మంకీపాక్స్‌ వైరస్‌ విస్తరించిందని గుర్తించారు. ద లాన్సెట్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ఆ రిపోర్ట్‌ను ప‌బ్లిష్ చేశారు. ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్కుల్లో ఉన్న మంకీపాక్స్ వైర‌స్‌.. వారి నుంచి వారి వ‌ద్ద ఉన్న కుక్క‌కు సోకిన‌ట్లు తేల్చారు. ఆ ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్కుల్లో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన 12 రోజుల త‌ర్వాత .. వారి వ‌ద్ద ఉంటున్న నాలుగేళ్ల ఇటాలియ‌న్ గ్రేహోండ్ కుక్క‌లో ఆ ల‌క్ష‌ణాల‌ను గుర్తించారు. ఆ కుక్క పిల్ల‌కు గ‌తంలో ఎటువంటి అనారోగ్యం లేదు. అయితే వైర‌స్ పరీక్ష‌లో అది పాజిటివ్‌గా తేలింది. స్వ‌లింగ సంప‌ర్కుల్లో లాటినో మ‌నిషికి స్కిన్ అల్స‌ర్ ఉంది. అయితే అత‌ని వ‌ద్ద ప‌డుకుంటున్న ఆ కుక్క‌కు వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. లాటినో మ‌నిషి, కుక్క నుంచి మంకీపాక్స్ వైర‌స్ డీఎన్ఏను సేక‌రించి వాటిని ప‌రీక్షించారు. ఆ ఇద్ద‌రి వ‌ద్ద ఉన్న వైర‌స్‌లో హెచ్‌ఎంపీఎక్స్‌వీ-1 ఉన్న‌ట్లు తేల్చారు. దీన్ని B.1 లీనియేజ్‌గా గుర్తించారు. దీని ద్వారా వైర‌స్ మ‌నిషి నుంచి కుక్క‌కు వ్యాపించిన‌ట్లు నిర్ధారించారు.

- Advertisement -