- Advertisement -
విలక్షణ సినిమాలతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. మాస్ అండ్ క్లాస్ కేరక్టర్స్ చేయడంలో తిరుగులేని టాలెంట్ మోహన్ లాల్ సొంతం. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ఆరాట్టు.
ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది. ఆరాట్టు పోస్టర్స్ పై సినిమాలో మోహన్ లాల్ చెప్పిన ‘నేను చాలా డేంజరస్’ అనే డైలాగ్ తో పబ్లిసిటీ చేస్తున్నారు. దీనిని బట్టి తెలుగులో కూడా సినిమాను డబ్బింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే సినిమాలో మోహన్ లాల్ చేత తెలుగు డైలాగ్స్ పలికించినట్లు సమాచారం.
- Advertisement -