చిరుకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మోహన్ బాబు..

41
chiru

మెగాస్టార్ చిరంజీవికి సర్‌ప్రైజ్ ఇచ్చారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆచార్య షూటింగ్ జరుగుతుండగా సెట్స్‌కి వెళ్లిన మోహన్ బాబు…మెగాస్టార్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు.

ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. దీనికి డైమెండ్ రత్న బాబు దర్శకత్వం చేస్తున్నాడు.