కొత్త నోట్లతో ఉడాయించిన బ్యాంకు మేనేజ‌ర్ !

246
Mohali banker flees with Rs 7 lakh meant for ATM
Mohali banker flees with Rs 7 lakh meant for ATM
- Advertisement -

పెద్ద నోట్లు రద్దుతో జ‌నం నానా ఇబ్బందులూ ప‌డుతుంటే.. మ‌రోవైపు ఓ బ్యాంకు ఉద్యోగి మాత్రం ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన రూ.6.98 ల‌క్ష‌ల‌తో ఉడాయించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బంకర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

punjabbank

నోట్ల ర‌ద్దును ప్ర‌ధాని ప్ర‌క‌టించిన త‌ర్వాతి రోజు, అంటే న‌వంబ‌ర్ 9న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజ‌ర్ తేజ్ ప్ర‌తాప్ సింగ్ భాటియాకు బ్యాంకు అధికారులు ఆ డ‌బ్బు అప్ప‌గించారు. నిందితుడు భాటియా ఏటీఎంకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేసేందుకు రావాల్సిందిగా బ్యాంకు ఇంజినీర్లకు, సెక్యురిటీ సిబ్బందికి చెప్పాడు. అయితే తాను ప్రత్యేక వాహనంలో డబ్బు తీసుకుని వస్తాననీ… అందరూ ముందు ఏటీఎంకు చేరుకోవాలని నమ్మబలికాడు.

ఏటీఎం దగ్గరికెళ్లిన సిబ్బంది భాటియా కోసం ఎంత నిరీక్షించినా ఆయన అక్కడికి రాలేదు. ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. బ్రాంచ్ మేనేజ‌ర్ కూడా భాటియాను కాంటాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. న‌వంబ‌ర్ 10 సాయంత్రం వ‌ర‌కు వేచిచూసిన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాము ఇప్పటికే విచారణ చేపట్టామనీ… త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ దీపేందర్ సింగ్ పేర్కొన్నారు.

 కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కమలానగర్ సిండికేట్ బ్యాంక్ లో రూ.6లక్షలు మార్పిడి కేసులో మల్లేష్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.సిండికేట్ బ్యాంక్ క్లర్క్ మల్లేష్ ను సరూర్ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.

- Advertisement -