ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి కరోనా..!

52
moen ali

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ టీమ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ కరోనా బారీన పడ్డారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా మొయిన్ అలీకి పాజిటివ్‌గా తేలింది.

మొయిన్ అలీకి పాజిటివ్ రావడంతో అతడ్ని వెంటనే 10 రోజుల క్వారంటైన్‌కి తరలించారు. అలీతో క్లోజ్ కాంటాక్ట్ అయిన క్రిస్‌వోక్స్‌కి మరోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉండాలని ఆదేశించారు.

గాలె వేదికగానే శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు రెండు టెస్టులనూ ఆడనుండగా.. జనవరి 26తో ఈ సిరీస్ ముగియనుంది. ఆ వెంటనే భారత్‌కి రానున్న ఇంగ్లాండ్ టీమ్.. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఆడనుంది.