మోడీ ప్రమాణస్వీకారం…హాజరయ్యే అతిథులు వీరే..!

385
modi oath
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన నరేంద్ర మోడీ ఈ నెల 30న రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్‌స్టెక్ దేశాల అధినేతలతోపాటు మారిషస్, కిర్గిజ్ నేతలకు ఆహ్వానం పంపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఆమె బదులు ఆ దేశ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హమీద్ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియింట్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని లోటే త్సేరింగ్, థాయిలాండ్ ప్రత్యేక రాయబారి గ్రిసాడా బూన్రాచ్ హాజరు కానున్నారు.

ఇక మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ హజరుకానున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. దేశ ప్రధాని కావడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు మమతా. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్‌,తెలంగాణ సీఎం కేసీఆర్,గవర్నర్ నరసింహన్‌ ఒకే విమానంలో ఢిల్లీకి బయలర్దేరి వెళ్లనున్నారు.

పొరుగుదేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను భారత్ ఆహ్వానించలేదు. 2014లో తొలిసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సహా ‘సార్క్’ దేశాల నేతలు హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -