మోడీకి థ్యాంక్స్.. దేశాన్ని దిగజార్చినందుకు?

57
- Advertisement -

2014 నుంచి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టినది మొదలుకొని దేశం ఎన్నో రంగాలలో ముందుకు దూసుకుపోతోందని మోడీ పాలనపై కమలనాథులు నిత్యం పొగడ్తల వర్షం కురిపించడం సర్వసాధారణమే. మేకిన్ ఇండియా, డిజిటల్ వంటి విధానాలనూ దేశంలో తీసుకొచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అటు సాంకేతికంగా కూడా ప్రస్తుతం అగ్రరాజ్యాల సరసన భారత్ నిలవడానికి మోడీ తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలే అని చెప్పవచ్చు. ఇదిలా ఉంచితే మరోవైపు మోడీ పాలనలో దేశం యొక్క అప్పుల చిట్టా తీవ్రంగా పెరిగిపోయింది. ఫలితంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవే కాకుండా జి‌ఎస్‌టి, సెస్ వంటి ఇతర పన్నుల భారం కూడా ప్రజలపై ఆదనంగా మోపుతోంది మోడీ సర్కార్. దీంతో దేశం ఎంత అభివృద్ది పథంలో దూసుకుపోతున్న.. సామాన్యుడిపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఇక మోడీ పాలనలోని లొసుగులను నిత్యం ఏదో ఒక రీతిలో బయటపెట్టే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. మరోసారి మోడీ హయంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రధాని మోడీ హయంలో 2022 సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

అప్పులు, నిరుద్యోగం, వాణిజ్య లోటు, వంటివి విపరీతంగా పెరిగిపోయాయని, మరోవైపు తలసరి ఆదాయం.. రూపాయి మారకం దారుణంగా పతనం అవుతోందని ప్రశాంత్ భూషణ్ రాసుకొచ్చారు. 2014 కంటే ముందు దేశంలోని పరిస్థితులను అలాగే 2014 తరువాత 2022 వరకు ప్రస్తుతం దేశంలో మోడీ సర్కార్ ఏ స్థాయిలో విఫలం అయిందో చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే ప్రశాంత్ భూషణ్ మొదటి నుంచి కూడా మోడీ పాలన ఏ స్థాయిలో విఫలం అవుతోందో తనదైన రీతిలో ప్రస్తావిస్తుంటారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ప్రగతి పథంలో తెలంగాణ ముందడుగు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కోలీవుడ్‌ స్టార్ భేటీ

నాగలి కాదు రాజ్యాంగాన్ని నడిపించాలి…

- Advertisement -