రూ.1000,రూ.500 నోట్లు రద్దు…

227
Modi Says Rs. 500 And Rs. 1,000 Notes Being Discontinued
- Advertisement -

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బ్లాక్ మనీ నిరోధానికిఇవాళ అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఢిల్లీలో జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖని స్పష్టం చేశారు.‘సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌’ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు..నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. త్వరలో  కొత్త రూ.500 నోట్లు,రూ.2000 నోట్లు తీసుకోస్తామని తెలిపారు.

note 1000

డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించవచ్చని ప్రధాని వెల్లడించారు. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు..నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడు.. అధికారం అనుపానులు తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడతున్నారు. ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం’’ అని వివరించారు.

note 500

9,10 తేదీల్లో ఏటీఎంలు పనిచేయవన్నారు. డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఐడీ కార్డు చూపించాలని స్పష్టం చేశారు. రోజుకు 10 వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు వీలుంటుందని….వారానికి 20 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని మోడీ తెలిపారు.

పేదవారు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోడీ చెప్పారు. అవినీతి నిర్మూలనకోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగనోట్లు అభివృద్ధికి అవరోదంగా మారాయని, పొరుగు దేశం దొంగనోట్లను రవాణా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు.

- Advertisement -