స్వల్ప ఆధిక్యతలో ట్రంప్…

226
Donald Trump Leads Hillary Clinton in Tight Races
- Advertisement -

చివరి వరకూ ఉత్కంఠ రేపిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పసిఫిక్ తీర రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్‌లతో పాటు అలాస్కా, హవాయ్ దీవుల్లో మాత్రం బుధవారం ఉదయం 8 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నంలోపు అధ్యక్షుడు ఎవరనేది దానిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది.

అమెరికాలో సంప్రదాయబద్ధంగా, అందరికంటే ముందు… అర్ధరాత్రి దాటగానే ఓటుహక్కును వినియోగించుకునే డిక్స్‌విల్లెనాచ్, హార్ట్స్ లొకేషన్, మిల్స్‌ఫీల్డ్ గ్రామాల్లో హిల్లరీకంటే ట్రంప్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. పోలింగ్‌రోజున అమెరికాలో అందరికంటే ముందుగా అర్ధరాత్రే ఓటు హక్కును వినియోగించుకునే న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలోని మూడు చిన్న కుగ్రామాల్లో (హామ్లెట్లు) .. డోనాల్డ్‌ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కన్నా ముందంజలో నిలిచారు. డిక్స్‌విల్లెనాచ్, హార్ట్స్ లొకేషన్, మిల్స్‌ఫీల్డ్ అనే మూడు కుగ్రామాల్లో ఓటర్ల సంఖ్య వంద కూడా దాటదు. ఈ విధంగా వందకన్నా తక్కువమంది ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోకన్నా ముందే జరగటం సంప్రదాయం.

న్యూహాంప్‌షైర్‌లోని సదరు మూడు కుగ్రామాల్లో… మం గళవారం (సోమవారం అర్ధరాత్రి దాటగానే) ఓటర్లు పోలింగ్‌బూత్‌లలోకి వెళ్లి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ట్రంప్ 32-25 ఆధిక్యంతో హిల్లరీకంటే ముందంజలో నిలిచారని ఫలితాలు వెల్లడించాయి. అయితే.. విడివిడిగా చూసినప్పుడు డిక్స్‌విల్లెనాచ్‌లో హిల్లరీనే విజయం సాధించారు. హార్ట్స్ లొకేషన్‌లో హిల్లరీకి 17, ట్రంప్‌కు 14 ఓట్లు, మిల్స్‌ఫీల్డ్‌లో హిల్లరీకి కేవలం నాలుగు ఓట్లు రాగా.. ట్రంప్‌కు 16 ఓట్లు లభించాయి. మొత్తమ్మీద ఈ మూడు కుగ్రామాలు కలిపి ట్రంప్‌కు 32, హిల్లరీకి 25 ఓట్లు లభించాయి.

Hillari clinton

20 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, 4.2 కోట్ల మంది ముందస్తు ఓటేశారు. వీరిలో నల్లజాతీయులు, లాటిన్ వలసదారులు ఎక్కువగా ఉండడంతో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడొచ్చని భావిస్తున్నారు. 2012లో 3.23 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఎన్నికలో దాదాపు 12 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.

న్యూయార్క్‌లో హిల్లరీ, ట్రంప్ ఓటు.. భర్త బిల్‌క్లింటన్‌తో కలసి న్యూయార్క్ రాష్ట్రం చాప్పాక్వాలోని ప్రాథమిక పాఠశాలలో హిల్లరీ ఓటేశారు. ‘ఆనందంగా ఉన్నా’ అంటూ పోలింగ్ బూత్ బయటకు వస్తూ అన్నారు. పార్టీ మద్దతుదారులకు చేతులూపుతూ ఉత్సాహంగా కన్పించారు. మద్దతుదారులు ‘మేడమ్ ప్రెసిడెంట్’ అంటూ నినాదాలు చేశారు. ఇక భార్య మెలేనియాతో కలసి ట్రంప్ న్యూయార్క్ నగరంలో ఓటు వేశారు.

సర్వేలన్ని హిల్లరీకే అనుకూలంగా ఉన్నాయి. హిల్ల్లరీ అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఖాయమని సీఎన్‌ఎన్ పేర్కొంది. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని, స్వింగ్ రాష్ట్రాలైన వర్జీనియా, కొలరాడో, నెవడాల్లో మైనార్టీలు, ఉన్నత విద్యావంతుల ఓటర్లను ఆకర్షించడంలో విజయం సాధించారని తెలిపింది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు చివరి నిమిషం వరకూ ప్రచారం నిర్వహించారు. చివరిగా నార్త్ కరోలినా రాష్ట్రం రాలైగ్‌లో భారీ ర్యాలీలో హిల్లరీ ప్రసంగించారు. ట్రంప్ మిచిగన్ రాష్ట్రంలో చివరి ప్రసంగం చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల కు ఇద్దరి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగిసింది.

Hillari clinton

రిపబ్లికన్ పార్టీ గెలిచే స్థానాలు..

అలబామా(9), అలాస్కా(3), ఐడహ(4), ఇండియానా(11), క్యాసస్(6), కెంటకీ(8), లూసియానా(8), మిస్సిసిపి(6), మిస్సోరీ(10), మాంటెనా(3), నెబ్రాస్కా(4), నార్త్ డకోటా(3), ఒక్లహోమా(7), సౌత్ కరోలినా(9), సౌత్ డకోటా(3), టెన్నెసే(11), టెక్సాస్(38), వెస్ట్ వర్జీనియా(5), వయోమింగ్(3) …. మొత్తం ఎలక్టోరల్స్ 157.
మొగ్గు రాష్ట్రాలు: జార్జియా(16), అయోవా(6), మైనే రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), ఒహయో(18), యూటా(6)…. మొత్తం 47

డెమోక్రటిక్ పార్టీ గెలిచే స్థానాలు…

కాలిఫోర్నియా(55), కనెక్టికట్(7), డేలావేర్(3), వాషింగ్టన్ డీసీ(3), హవాయ్(4), ఇలినారుుస్(20), మైనే(3), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), ఓరెగాన్(7), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్(3), వాషింగ్టన్(12), మిన్నెసొటా(10), న్యూ మెక్సికో(5) మొత్తం 200.
మొగ్గు రాష్ట్రాలు: కొలొరడో(9), మిషిగన్(16), పెన్సిల్వేనియా(20), వర్జీనియా(13), విస్కాన్సిన్(10)… మొత్తం 68

హోరాహోరీ రాష్ట్రాలు

అరిజోనా(11), ఫ్లోరిడా(29), నెవెడా(6), నెబ్రాస్కా రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), న్యూహ్యాంప్‌షైర్(4), నార్త్ కరోలినా(15)… మొత్తం 66

Donald Trump Leads Hillary Clinton in Tight Races

సీఎన్‌ఎన్ తాజా అంచనాల ప్రకారం… ఒహయో, యూటా రాష్ట్రాలతో పాటు మైనే రాష్ట్రంలోని ఒక డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ పార్టీకి గెలుపు అవకాశాలున్నారుు. ఇక అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో పోరు హోరాహోరీ.. పూర్తి పట్టున్న, స్వల్ప ఆధిక్యం ఉన్న రాష్ట్రాల నుంచి హిల్లరీకి 268 ఎలక్టోరల్స్ ఓట్లు ఖాయం. ఇక ట్రంప్‌కు 204 ఎలక్టోరల్స్ రావచ్చు. అధ్యక్ష పీఠం దక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి… 66 సీట్ల కోసం హోరాహోరీ సాగొచ్చు.

ఎన్నికల సర్వేల్లో ట్రంప్ వెనుకబడి ఉన్నప్పటికీ.. అమెరికన్ల గూగుల్ సెర్చ్‌లో మాత్రం హిల్లరీకన్నా ఆయనే ముందంజలో ఉన్నారు. అమెరికాలోని మొ త్తం 50 రాష్ర్టాలకుగాను 38 రాష్ర్టాల్లో సోమవారం నాటికి జరిగిన గూగుల్ సెర్చ్‌లలో ట్రంప్ గురించి వెతికినవారి సంఖ్య అత్యధికంగా ఉందని గూగుల్ వెల్లడించింది. ఎన్నికల పోరు హోరాహోరీగా నడుస్తున్న ఫ్లోరిడా, మిషిగన్ రాష్ర్టాలు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ట్రంప్ గురించి సెర్చ్ చేస్తున్నవాళ్లు ఎక్కువగా వలసవిధానం, జాతి, గర్భస్రా వం, ఇస్లామిక్‌స్టేట్, ఆర్థికరంగం అనే అంశాలను పరిశీలిస్తున్నారు. గత రెండురోజుల వ్యవధిలో ట్రంప్ ఏం మాట్లాడారన్న అంశాన్ని కూడా అనేకమంది సెర్చ్ చేశారని తెలుస్తోంది.

- Advertisement -