సెక్సువల్ ఫేవర్‌..మంచమూ నేరమే

280
sexual favour
- Advertisement -

ప్రభుత్వ అధికారులు లంచం రూపంలో డబ్బు మాత్రమే కాదు మంచం కోరుకున్నా అది అవినీతి కిందకు వస్తుందని అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 స్పష్టం చేసింది. ఇందుకుగాను ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపింది.

సెక్సువల్ ఫేవర్స్ అడగడం లేదా అంగీకరించడం, ఎక్స్‌పెన్సివ్ క్లబ్ మెంబర్‌షిప్, హాస్పిటాలిటీ, దగ్గరి స్నేహితులకు లేదా బంధువులకు ఉద్యోగం కల్పించడం తదితరాలపై సీబీఐ సదరు పబ్లిక్ సర్వెంట్‌ను విచారించవచ్చని తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం లంచం ఇచ్చిన వారికి కూడా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

2015 నవంబరులో మోడీ సర్కారు లాకమిషన్‌కు బాధ్యతలు అప్పగించగా.. 2016లో పార్లమెంట్‌లో సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జూలై చివరలో నోటిఫై చేసింది. లంచానికి సంబంధించిన అన్ని అంశాలు ఒకే గొడుకు కింద ఉండాలని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2018ను తీసుకు వచ్చినట్లు సుప్రీం కోర్టు న్యాయవాది రావు తెలిపారు.

- Advertisement -