హాలీవుడ్‌ మూవీ టీజర్‌లో ధనుష్‌ అదుర్స్…

232
Dhanush releases teaser of his Hollywood debut...
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘రఘవరన్ బీటెక్’ తో తెలుగు ఆడియెన్స్‌కి మరింత కనెక్ట్ అయిపోయాడు. తనదైన స్టైల్లో మూవీస్‌ చేస్తూ.. మాస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు ధనుష్.

అయితే తాజగా ధనుష్ హాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అయిపోయాడు. త్వరలోనే అక్కడకూడా హంగామా చేయబోతున్నాడు. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’ అనే హాలీవుడ్‌ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నాడు. రొమైన్ ప్యూర్తొలా రాసిన ‘ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హౌ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్’ అనే పుస్తకం ఆధారంగా కెనడియన్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ కమ్‌ డైరెక‍్టర్‌ కెన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 Dhanush releases teaser of his Hollywood debut...

అయితే కొద్ది సేప‌టి క్రితమే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీన్ని ధనుష్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా తొలి ఇంగ్లీషు సినిమా ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’. ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా..తాజా టీజర్‌లో ధనుష్ నటన టైటిల్‌కు తగ్గట్టే ఎక్స్టార్డినరీ‌గా ఉంది. దేశం కాని దేశంలో బక్కపలచని శరీరంతో అమాయకత్వం చూపిస్తూ.. అంతే అల్లరితనం కలగలసిన కుర్రాడిగా ధనుష్ అదుర్స్ అనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ సరసన బెరనైస్ బెజో, అలెగ్జాండ్రా దడారియోలు నటించారు. కాగా..ఈ సినిమా మే 30న‌ ఇంగ్లీష్‌తో పాటు ఫ్రెంచ్‌లో కూడా రిలీజ్‌ కానుంది.

- Advertisement -