కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు:మోదీ

5
- Advertisement -

అస్సాంలోని బర్పేటాలో జరిగిన భారీ ప్రజా సభలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ-ఎన్‌డీఏ కూటమి వరుసగా మూడోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.మోదీ మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో రెండు విషయాలు ఖాయమని అన్నారు.ఒకటి బీజేపీ-ఎన్‌డీఏ హ్యాట్రిక్ విజయం, రెండవది కాంగ్రెస్‌కు “పరాజయాల సెంచరీ” అని పేర్కొన్నారు. దిల్లీలో కూర్చున్న ‘నామ్దార్’ నాయకులు (Rahul Gandhi)ను ఉద్దేశిస్తూ.. తమ ఓటముల సంఖ్యను 100కి చేరుకున్నట్లు చూస్తారు అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి లేదని, అవినీతి ఆధారంగా పనిచేస్తోందని మోదీ ఆరోపించారు. బీజేపీ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి “విశాల దృష్టితో” పనిచేస్తోందని చెప్పారు. గత దశాబ్దంలో తమ ప్రభుత్వం అస్సాంలో శాంతి, అభివృద్ధి కోసం కృషి చేసిందని, రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్తామని మోదీ తెలిపారు.

ఏప్రిల్ 6న బీజేపీ స్థాపన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ముందు అనే నినాదంతో భారత్‌ను అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Also Read:CSKపై RCB వరుసగా నాలుగో గెలుపు

- Advertisement -