ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా నాలుగోసారి గెలుపొందింది ఆర్సీబీ. చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250/3 పరుగుల భారీ స్కోరు సాధించింది.
CSK ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఓవర్‌కు 12.50కి పైగా రన్‌రేట్ అవసరం కాగా, తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. జాకబ్ డఫీ రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. సర్ఫరాజ్ ఖాన్, కార్తిక్ శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. కానీ కృనాల్ పాండ్య ఒకే ఓవర్‌లో ఇద్దరినీ ఔట్ చేశాడు.
ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 43 పరుగులు చేసి భవిష్యత్తుకు ఆశ చూపించాడు. జేమీ ఓవర్టన్ 16 బంతుల్లో 37 పరుగులు చేసి కొంత పోరాటం చేశాడు. కానీ అవసరమైన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో, వికెట్లు కూడా తక్కువగా ఉండటంతో ఆర్సీబీ ఓటమి తప్పలేదు. ఈ విజయంతో RCB ఒక పెద్ద రికార్డు సాధించింది. IPL చరిత్రలో తొలిసారి CSKపై వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. 2024లో మొదలైన ఈ విజయ పరంపర ఇప్పుడు నాలుగు మ్యాచ్‌లకు చేరింది.
Also Read:కొత్త కాన్సెప్ట్‌తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ!

