అరుణాచల్ సీఎంపై సీబీఐ దర్యాప్తు

7
- Advertisement -

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అస్సాం ముఖ్యమంత్రి పెమా ఖండుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.

గత దశాబ్దంలో ప్రభుత్వ కాంట్రాక్టులను తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. సుమారు ₹1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఈ సంస్థలకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్, సీబీఐకి రెండు వారాల్లో ప్రాథమిక విచారణ (Preliminary Enquiry) నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసు సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్ మరియు వాలంటరీ అరుణాచల్ సేన దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ఆధారంగా విచారణకు వచ్చింది.
జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 వరకు జరిగిన అన్ని కాంట్రాక్ట్ కేటాయింపులను ఈ విచారణలో పరిశీలించాలని కోర్టు తెలిపింది.

సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కోర్టు, పిటిషన్‌లో ఉన్న ఆరోపణలకే పరిమితం కాకుండా మరింత విస్తృతంగా దర్యాప్తు చేయాలని సూచించింది. ప్రత్యేకంగా సీఎం ఖండు, ఆయన భార్య, తండ్రి రెండో భార్య రించిన్ డ్రెమా, మేనల్లుడు సెరింగ్ తాషి పేర్లతో ఉన్న కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులు, నిధులఇవరాలను పరిశీలించాలని ఆదేశించింది.

ALso Read:CSKపై RCB వరుసగా నాలుగో గెలుపు

సీబీఐ నాలుగు నెలల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు అవసరమైన పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారి నియమించాలని కూడా పేర్కొంది. అదేవిధంగా, కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను నాశనం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -